సత్రం భూమి ఆక్రమించి చెరువు తవ్వేశారు

ABN , First Publish Date - 2022-07-01T06:01:15+05:30 IST

పెదకాపవరం పరిధిలోని త్రీపర్రు ఈడ్పు గంటి రత్తమ్మ సత్రానికి చెందిన భూమిని ఆక్రమించి సరిహద్దు రైతు ఆక్వా చెరువు తవ్వారని కౌలు రైతు వుదిసే ప్రభాకరరావు ఆరోపించారు.

సత్రం భూమి ఆక్రమించి చెరువు తవ్వేశారు
సత్రం భూమిలో రొయ్యల చెరువు చూపుతున్న కౌలు రైతు

ఆకివీడు రూరల్‌ జూన్‌ 30: పెదకాపవరం పరిధిలోని త్రీపర్రు ఈడ్పు గంటి రత్తమ్మ సత్రానికి చెందిన భూమిని ఆక్రమించి సరిహద్దు రైతు ఆక్వా చెరువు తవ్వారని కౌలు రైతు వుదిసే ప్రభాకరరావు ఆరోపించారు. భూమి కౌలు హక్కు వేలం నిర్వహించేందుకు గురువారం వచ్చిన అధికారులను కౌలు రైతు నిలదీశారు. చెరువు తవ్వుతున్న సమయంలో అధికారులకు సమాచారం ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదని, సత్రం భూమిలో గట్టు వేశా రని, తాము ఎలా సాగు చేయాలని,  కౌలు ఎలా చెల్లించాలని నిలదీశారు. ఆక్వా చెరువుకు నీరు పెట్టుకునేందుకు పంటబోదె తవ్వి మట్టిని సత్రం భూమిలో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందించ లేదన్నారు. కౌలుకు తీసుకున్న తాను తీవ్రంగా నష్టపో యానని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆక్రమణ తొలగించి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటే కౌలుకు సాగు చేస్తామన్నారు. దీంతో కౌలు వేలం వాయిదా వేసినట్లు సత్రం ఈవో వెంకట్రావు తెలిపారు.


వరి సాగుకు అడ్డంకిగా ఆక్వా చెరువులు


ఆక్వా చెరువుల కారణంగా వరి సాగు చేయలేకపోతున్నామని అప్పారావు పేట గుమ్ములూరుకోడు ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుమ్ము లూరు కోడు ద్వారా సుమారు 250 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఈకోడు నీరు నేరుగా కొల్లేరులోనికి వెళుతుందని, దిగువన ఆక్వా చెరువుల యజమానులు నీటిని దిగువకు రాకుండా అడ్డు వేస్తున్నారని రైతులు వాపో తున్నారు. నారుమడులు వేసే పరిస్థితి లేదని అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. 5వ కాంటూరు నుంచి 0 కాంటూరు వరకు చెరువులు సాగు చేస్తున్నా అటవీశాఖాధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికా రులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదని రైతులు ఛీరా త్రిమూర్తుల, పెన్మేత్స సూర్యనారాయణరాజు, నున్న బాబు, గోనబోయిన సత్యనారాయణ తదితరులు హెచ్చరించారు.

Updated Date - 2022-07-01T06:01:15+05:30 IST