నేటి నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-10-23T11:28:35+05:30 IST

ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్‌-2020 వెబ్‌ కౌన్సెలింగ్‌ శుక్రవారం నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

నేటి నుంచి  ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

27 వరకు తణుకు పాలిటెక్నిక్‌ కళాశాలలో 

ర్యాంకుల వారీగా ధ్రువపత్రాల పరిశీలన


భీమవరం రూరల్‌, అక్టోబరు 22 : ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్‌-2020 వెబ్‌ కౌన్సెలింగ్‌ శుక్రవారం నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు తణుకు ఎస్‌ఎంవీఎం పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎంసెట్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ 23న ఒకటి నుంచి 20 వేల ర్యాంకు వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేస్తారు. 24న 20,001 నుంచి 50 వేల ర్యాంకు వరకు, 25న 50,001 నుంచి 80 వేల ర్యాంకు వరకు, 26న 80,001 నుంచి లక్షా 10 వేల ర్యాంకు వరకు, 27న 1,10,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు సర్టిఫికెట్స్‌ వేరిఫికేషన్‌ చేసుకోవచ్చు.


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏమైనా ఇబ్బందు లుంటే హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను సంప్రదించవచ్చుని సెంటర్‌ కో ఆర్డి నేటర్‌ రాజేంద్రబాబు తెలిపారు. అలాగే ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజ నీరింగ్‌ కళాశాలలో 23, 26 తేదీల్లో ఎంసెట్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటుచేశారు. స్పెషల్‌ కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీల నకు విజయవాడ బెంజి సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశా లలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. ఆంగ్లో ఇండియన్‌, పీహెచ్‌సీ, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌, ఎన్‌సీసీ విద్యార్థులు వెళ్లాలి. 


కౌన్సెలింగ్‌ కావాల్సినవి

అన్ని రకాల ఒరిజినల్స్‌తోపాటు రెండు సెట్ల నకళ్లును తీసుకు  వెళ్లాలి. ఏపీ ఎంసెట్‌ ర్యాంకు కార్డు, హాల్‌ టికెట్‌, ఇంటర్‌ మార్క్స్‌ లిస్టు, 10వ తరగతి మార్క్స్‌లిస్టు, ఇంటర్‌ టీసీ, స్టడీ సర్టిఫికెట్‌ ఆరు నుంచి ఇంటర్‌ వరకు, క్యాస్ట్‌ సర్టిఫికెట్‌.. ఈడబ్ల్యుఎస్‌ సర్టిఫి కెట్‌, ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌.. ఆధార్‌, కౌన్సెలింగ్‌ ఫీజు కింద ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600 చెల్లించాలి.


డీఎల్‌డీవోల నియామకం

ఏలూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి):గ్రామ సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించి, వాటి కార్యకలాపాలను విస్తృత పరిచేందుకు డివిజినల్‌ అభివృద్ధి అధికారుల (డీఎల్‌డీవో)ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జిల్లాలోని ఐదు డివిజన్లకు ఐదుగురు సీనియర్‌ ఎంపీడీవోలను ఇన్‌చార్జి డీఎల్‌డీవోలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎంపీడీ వోలుగా పదేళ్లకు మించి సేవలందించిన అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ వీరే కొనసాగుతారు. జిల్లాలోని ఈ పోస్టులన్నీ మహిళా ఎంపీడీవోలకే దక్కడం విశేషం. కామవరపుకోట ఎంపీడీవో డీవీఎస్‌ పద్మినిని జంగారెడ్డిగూడెం డివిజన్‌కు, ఆకివీడు ఎంపీడీవో పి.రమాదేవి ఏలూరుకు, కొవ్వూరు ఎంపీడీవో జి.జగదాంబ కొవ్వూరుకు,  పెరవలి ఎంపీడీవో వి.విజయలక్ష్మిని కుక్కునూరుకు, భీమవరం ఎంపీడీవో జి.పద్మను నరసాపురం డివిజన్‌కు నియమించారు. 

Updated Date - 2020-10-23T11:28:35+05:30 IST