ఉద్యోగులు స్థానికంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-07-08T04:36:08+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక హెడ్‌ క్వార్టర్‌లో ఉండాలని ఎంపీటీసీ సభ్యులు సోహెల్‌ అహ్మద్‌, ఇతర సభ్యులు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయల సమావేశ మందిరంలో గురువారం ఎంపీపీ సువర్ణ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావే శం నిర్వహించారు.

ఉద్యోగులు స్థానికంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఏవో మధులత

- మండల సర్వ సభ్య సమావేశంలో సభ్యుల డిమాండ్‌

సిర్పూర్‌(టి), జూలై 7: ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక హెడ్‌ క్వార్టర్‌లో ఉండాలని ఎంపీటీసీ సభ్యులు సోహెల్‌ అహ్మద్‌, ఇతర సభ్యులు డిమాండ్‌ చేశారు.  మండల కేంద్రంలోని ఎంపీడీవో  కార్యాయల సమావేశ మందిరంలో గురువారం ఎంపీపీ సువర్ణ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖాధికారి మధుల త మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌కు సరిపడ ఎరువులనె తెప్పించడానికి నివేదికలు పంపించామని, ఎరువుల కోసం రైతులు ఎలాంటి అధైర్య పడవద్దన్నారు.  సమావేశం నడుస్తుండగా సభ్యులందరు లేచి ఏ ఒక్క అధికారి కూడా హెడ్‌ క్వార్టర్‌లో ఉండడం లేదని మండిపడ్డారు. ఉపాధ్యాయులైతే రామగిరి రైలు ద్వారా మంచిర్యాల, కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి పట్టణాల నుంచి రాక పోకలు సాగిస్తున్నారని చెప్పారు. హెడ్‌ క్వార్టర్లలో అధికారులు లేక పోవడంతో అభివృద్ధి కుంటు పడుతుందని, అధికారులు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను కోరారు. స్పందించిన ఆయన అధికారులు స్థానికంగా ఉండేలా ఆదేశిస్తామని సూచించారు. తహసీల్దార్‌ రవీందర్‌ మాట్లాడుతూ మండలంలో 16 రేషన్‌ దుకాణాలు ఉన్నాయని, వీటి ద్వారా నాలుగు వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి అయిదుకిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఎంఈవో సోమయ్య మాట్లాడుతూ మండలంలో మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఇందులో 11 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయని, మిగితా ఏడు పాఠశాలల్లో కలెక్టర్‌ ఆమోదంతో  ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఎంపీటీసీ తుకారాం మాట్లాడుతూ మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో మూత్ర శాలలు లేవని సులభ్‌ కాంప్లెక్స్‌ కోసం స్థలం కేటాయిస్తే తాను సొంతంగా కట్టిస్తానని తెలిపారు.  తహసీల్దార్‌ స్పందించి తప్పకుండా స్థలం కేటాయిస్తానని అన్నారు.  ఐకేపీ ఏపీఎం దుర్గయ్య మాట్లాడుతూ మండల కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో రూ.20 లక్షలతో రైతులకు ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వ్యవసాయ పని ముట్లు అద్దెకు ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు.  ఆర్‌డ బ్ల్యూఎస్‌ డీఈ సిద్దికీ మాట్లాడుతూ మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో ఏక్కడైనా సమస్యలు ఉంటే తక్షణమే పనులను చేపడుతామన్నారు. విద్యుత్‌ శాఖ ఏఈ ఇర్ఫాన్‌ మాట్లాడుతూ మండలంలో రెండు మూడు రోజుల పాటు విద్యుత్‌ అంతరాయం ఉంటుందన్నారు. ఏటీడీవో క్షేత్రయ్య మాట్లాడు తూ ఆశ్రమ పాఠశాల గిరిజన విద్యార్థులు విదేశి విద్యకు వెళ్లినట్ల యితే ప్రభుత్వ పరంగా సహకారం ఉంటుందని తెలిపారు.  సమా వేశంలో జడ్పీటీసీ రేఖ, వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీటీసీలు తాహెరాబేగం, తుకారాం, సర్పంచ్‌లు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-08T04:36:08+05:30 IST