ఉద్యోగుల నిర్బంధం

ABN , First Publish Date - 2022-08-06T06:55:02+05:30 IST

గోదా వరి వరదలకు ఇళ్ల పరిహారం సర్వేలో తమకు అన్యాయం జరి గిందని బెస్తగూడెం నిర్వాసితులు శుక్రవారం దాచారం సచివాల యం ముందు ఆందోళనకు దిగారు.

ఉద్యోగుల నిర్బంధం

ఇళ్ల పరిహారం సర్వేలో అన్యాయం జరిగిందని బాధితుల ధర్నా  


కుక్కునూరు, ఆగస్టు 5 : గోదావరి వరదలకు ఇళ్ల పరిహారం సర్వేలో తమకు అన్యాయం జరి గిందని బెస్తగూడెం నిర్వాసితులు శుక్రవారం దాచారం సచివాల యం ముందు ఆందోళనకు దిగారు. సచివాలయ సిబ్బందిని గదిలో ఉంచి బయట తాళం వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. గోదావరి వరదలకు ముంపుకు గురైన ఇళ్లను గుర్తించే క్రమంలో పాక్షికంగా, మద్యస్ధంగా, పూర్తిగా దెబ్బతిన్నాయా అనే విషయంపై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు జిల్లా హౌసింగ్‌ శాఖ సర్వే నిర్వహించింది. వీరంతా కుక్కునూరు మండలం వరద ముంపునకు గురయ్యే గ్రామానికి వెళ్లి ఇళ్లను పరిశీ లించి జాబితాను తయారుచేశారు. ఈ సర్వేలో తమకు అన్యాయం జరిగిందని బెస్త గూడెం, వెంకటాపురం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కూలిన ఇళ్లకు జాబితాలో చోటు దొరకలేదన్నారు. తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో ఎంపీడీవో శ్రీనివాస్‌ వారితో మాట్లాడారు. వరదకు ముంపునకు గురైన బాధితుల పేర్లు జాబితాలో లేని వారు రెండు రోజుల్లో సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సర్వే బృందం మరలా క్షేత్రస్ధాయికి వెళ్లి సర్వే జరుపుతారన్నారు.

Updated Date - 2022-08-06T06:55:02+05:30 IST