పీఆర్‌సీ విషయంలో ఉద్యోగులను ముంచుతున్నారు

ABN , First Publish Date - 2021-06-15T06:26:51+05:30 IST

పీఆర్‌సీ విషయంలో ఉద్యోగులను ప్రభుత్వం ముంచుతోందని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు.

పీఆర్‌సీ విషయంలో ఉద్యోగులను ముంచుతున్నారు
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

టీఆర్‌ఎస్‌ అంతర్గత కలహాలను ప్రజలు గమనిస్తున్నారు

బీజేపీలోకి వెళ్లి ఈటల తప్పు చేశారు

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, జూన్‌ 14 : పీఆర్‌సీ విషయంలో ఉద్యోగులను ప్రభుత్వం ముంచుతోందని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా అమలు చేస్తున్న పీఆర్‌సీని ప్రభుత్వం 2021 జూన్‌ నుంచి అమలు చేయాలని చూస్తోం దని దీంతో ఉద్యోగులు అంతకంటే ముందు కాలయాపన చేసిన మూడు సంవత్సరాల పీఆర్‌సీని కోల్పోతున్నారని తక్షణమే 2018 జూన్‌ నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగ నియమాకాలు లేకపోడంతో నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్పోయిన పీఆర్‌సీని పదవీ వి రమణ అనంతరం ఇస్తామని ప్రభుత్వం అనడంతో ఉద్యోగులు తీవ్రం గా నష్టపోతారన్నారు. బీజేపీలోకి వెళ్లి ఈటల రాజేందర్‌ తప్పు చేశారన్నారు. దీనికంటే  టీఆర్‌ఎస్‌లోనే కొనసాగి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వి ద్యను సీఎం అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. 2014కు ముందు కేసీ ఆర్‌కు ఉన్న ఆస్తులెన్ని ఇప్పుడు ఉన్న ఆస్తులెన్ని, ఆయన బంధువులకు ఉన్న ఆస్తుల వివరాలపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఆరోపణలు వచ్చిన ఈటల రాజేందర్‌పై విచారణ జరిపిన ప్రభుత్వం కేటీఆర్‌ ఫామ్‌ హౌజ్‌పై, మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌లు అక్రమంగా బఫర్‌ జోన్‌లో, అసైన్డ్‌ భూముల్లో పెద్ద పెద్ద కళాశాలలు నిర్మించారని వీరిపై ఎందుకు విచారణ చేపట్టలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న అదన పు కలెక్టర్లకు అధునాతన వాహనాలను అందిస్తున్న ప్రభుత్వం ఎవడబ్బ సొమ్ము అని ఖర్చుపెడుతున్నారో ప్రజలకు సమాధానమివ్వాలన్నారు.   ఉద్యోగ సంఘాల నాయకులు తమ హక్కులను తాకట్టు పెట్టి సొంత లాభం పొందుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, నాయకులు గాజుల రాజేందర్‌, కల్లెపల్లి దుర్గయ్య, గుంటి జగధీశ్వర్‌, జున్ను రాజేందర్‌ తదతరులు ఉన్నారు.

Updated Date - 2021-06-15T06:26:51+05:30 IST