రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న గిడ్డి ఈశ్వరి, టీడీపీ నేతలు
మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్
పాడేరు, జనవరి 26: ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఉద్యమానికి సంఘీభావంగా బుధవారం ఇక్కడ ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యోగులతో సహా అన్ని వర్గాల వారిని జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పీఆర్‌సీకి సంబంధించి జారీ చేసిన చీకటి జీవోలను, సీపీఎస్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో టీడీపీ నేతలు గంగపూజారి శివకుమార్, కొట్టగుళ్లి రమేశ్‌నాయుడు, కోడా వెంకటసురేశ్‌కుమార్, అల్లంగి సుబ్బలక్ష్మి, వర్తన నీలకంఠం, బూరెడ్డి నాగేశ్వరరావు, బుద్ద జ్యోతికిరణ్, చీకటి మధు, తదితరులు పాల్గొన్నారు.