దండే విఠల్‌కు ఎమ్మెల్సీ సీటు

ABN , First Publish Date - 2021-11-22T05:12:46+05:30 IST

కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన దండే విఠల్‌కు ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ సీటు ఖారారయింది. 2009 నుంచి 2013వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అనంతరం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

దండే విఠల్‌కు ఎమ్మెల్సీ సీటు
దండే విఠల్‌

- తొలిసారిగా కాగజ్‌నగర్‌ వాసికి దక్కిన పదవి

కాగజ్‌నగర్‌, నవంబరు 21: కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన దండే విఠల్‌కు ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ సీటు ఖారారయింది. 2009 నుంచి 2013వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అనంతరం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, 2000లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రారంభించారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు దండే విఠల్‌ పేరు ఖరారు కావడంపై పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎమ్మెల్సీగా పురాణం సతీష్‌ కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పురాణం సతీష్‌కు టిక్కెట్‌ను ఖరారు చేయలేదు. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పలువురు ఎమ్మెల్సీ పదవి ఆశించినప్పటికీ టికెట్‌ను వారెవరికీ కేటాయించలేదు. ఆశావాహులకు నిరాశ ఎదురు కావడంతో పరిస్థితులు ఏ మేరకు చేరుకుంటాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2021-11-22T05:12:46+05:30 IST