కరోనా కట్టడికి డొనేషన్లు ఇస్తే నాతో డిన్నర్ చేయచ్చు: ప్రముఖ నటి ఆఫర్

ABN , First Publish Date - 2020-04-01T01:53:32+05:30 IST

కరోనా కట్టడికి డోనేషన్లు ఇస్తే నాతో డిన్నర్ చేయచ్చు అన్న ప్రముఖ నటి ఎమీలియా క్లార్క్

కరోనా కట్టడికి డొనేషన్లు ఇస్తే నాతో డిన్నర్ చేయచ్చు: ప్రముఖ నటి ఆఫర్

లండన్: మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీరియల్ చూశారా? చూస్తే మీకు ఎమిలియా క్లార్క్ ఎవరో చెప్పనక్కర్లేదు. బ్రిటన్‌కు చెందిన ఎమిలియా.. ఈ సీరియల్‌లో అద్భుత నటన కనబరిచి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం కరోనా కట్టడి కోసం ప్రజల సాయం కూడా అవసరమైన నేపథ్యంలో ఆమె తన ఫ్యాన్స్‌ను రంగంలోకి దింపే ప్లాన్‌ను సిద్ధం చేసింది. అంటే.. కరోనా కట్టడికి సేమ్‌యూ అనే స్వచ్ఛంధ సంస్థకు ఆర్థిక సాయం చేసిన వారు తనతో డిన్నర్ చేయచ్చని ప్రకటించింది.


డిన్నరేంటీ.. కరోనా ఆంక్షలు ఉన్నాయి కదా అంటారా? మీ డౌటు కరెక్టే. అయితే ఎమిలీయా ఆఫర్ చేసింది వర్చువల్ డిన్నర్!. అంటే ఎవరి ఇళ్లలో వారు ఉంటూ కంప్యూటర్ ద్వారా ఎమిలియాతో మాట్లుడూతు డిన్నర్ చేయచ్చన్న మాట. కరోనా కట్టడికి కోసం ఆమె 2.5లక్షల పౌండ్లు సేకరించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. డొనేషన్లు ఇచ్చిన వారిలో పన్నెండు మంది లాటరీ ద్వారా సెలెక్ట్ చేస్తానని తెలిపింది. ‘మనం కలసి ఆహారం వండుకుందాం. కలసి కూర్చుని తింటూ బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం’ అని తన ఇన్‌స్టా ఎకౌంట్లో పోస్ట్ చేసింది. బాగుంది కదూ ఈ ఐడియా..

Updated Date - 2020-04-01T01:53:32+05:30 IST