Eluru: రైతు కూలీ ముక్కులో దూరిన Prawn ..ఆ తర్వాత..

ABN , First Publish Date - 2022-07-07T21:48:20+05:30 IST

చూపుడు వేలంతా కూడా లేని రొయ్య (Prawn) .. ఓ వ్యక్తికి చుక్కలు చూపించింది.

Eluru: రైతు కూలీ ముక్కులో దూరిన Prawn ..ఆ తర్వాత..

ఏలూరు (Eluru): చూపుడు వేలంతా కూడా లేని రొయ్య (Prawn) .. ఓ వ్యక్తికి చుక్కలు చూపించింది. ఊపిరాడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ ఘటన ఏలూరు (Eluru) జిల్లాలో జరిగింది. గణపవరంలోని ఓ చెరువులో రైతు కూలీ రొయ్యలు (Prawns) పడుతుండగా ఓ రొయ్య ఎగిరిపడి అతని ముక్కులోకి దూరింది. అది ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బందిపడి అల్లాడిపోయాడు. దీంతో అతనిని వెంటనే భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎండోస్కోపీ (Endoscopy) ద్వారా ముక్కు రంధ్రం నుంచి రొయ్యను బయటకు తీశారు. అప్పటికీ ఆ రొయ్య బతికుండడం విశేషం.

Updated Date - 2022-07-07T21:48:20+05:30 IST