కొలువుదీరిన కౌన్సిల్‌

ABN , First Publish Date - 2021-07-31T05:23:28+05:30 IST

ఏలూరు నగర పాలక సంస్థ నూతన పాలక మండలి కొలువుతీరింది. నగర మేయర్‌గా రెండో సారి షేక్‌ నూర్జహాన్‌, డిప్యూటీ మేయర్లుగా గుడిదేశి శ్రీనివాస రావు, నూకపెయ్యి సుధీర్‌బాబులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు.

కొలువుదీరిన కౌన్సిల్‌
ఏలూరులో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం

ఏలూరు మేయర్‌గా నూర్జహాన్‌

డిప్యూటీ మేయర్లుగా శ్రీనివాస్‌, సుధీర్‌బాబు

48 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం

జిల్లాలో మరో నాలుగు మునిసిపాలిటీల్లో రెండో వైస్‌ చైర్మన్ల ఎంపిక పూర్తి

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, జూలై 30 : ఏలూరు నగర పాలక సంస్థ నూతన పాలక మండలి కొలువుతీరింది. నగర మేయర్‌గా రెండో సారి షేక్‌ నూర్జహాన్‌, డిప్యూటీ మేయర్లుగా గుడిదేశి శ్రీనివాస రావు, నూకపెయ్యి సుధీర్‌బాబులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. కౌన్సిల్‌ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన పాలక మండలి సమావేశంలో ప్రిసైడింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా నూతనంగా ఎన్నికైన 48 మంది కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎంపిక చేశారు. వైసీపీ 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ షేక్‌ నూర్జహాన్‌ను మేయర్‌ అభ్యర్థిగా 9వ డివిజన్‌ కార్పొరేటర్‌ జి.శ్రీని వాస్‌ ప్రతిపాదించగా, 30వ డివిజన్‌ కార్పొరేటర్‌ పప్పు ఉమా మహేశ్వరరావు బలపరిచారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోవ డంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కలెక్టర్‌ ప్రకటించారు. మొదటి డిప్యూటీ మేయర్‌గా 35వ డివిజన్‌ కార్పొరేట్‌ గుడిదేశి శ్రీనివాస్‌ను 40వ డివిజన్‌ కార్పొరేటర్‌ పి.స్రవంతి ప్రతిపాదించ గా 39వ డివిజన్‌ కార్పొరేటర్‌ కిలాడి జ్యోతి బలపరిచారు. రెండో డిప్యూటీ మేయర్‌గా 22వ డివిజన్‌ నుంచి గెలుపొందిన నూక పెయి సుధీర్‌బాబును 5వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఇమ్మానియేల్‌ ప్రతిపాదించగా, 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ బలప రిచారు. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో వీరిద్దరినీ డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైనట్లు ప్రకటించి నియామక పత్రాల ను అందజేశారు. వీరు ముగ్గురిని సభ్యులు ఘనంగా సన్మానిం చారు. అంతకుముందు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో వైఎస్‌ఆర్‌ విగ్రహా నికి నూర్జహాన్‌, వైసీపీ నాయకులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, కార్పొ రేటర్లు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కౌన్సి ల్‌కు వచ్చారు. అనంతరం జరిగిన అభినందన సభలో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని మాట్లాడుతూ మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిం చిన ప్రజలకు.. నగరాన్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటామన్నారు. ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ తదితరులు పాల్గొన్నారు. 


 మేయర్‌గా తొలి సంతకం 


నగర మేయర్‌ నూర్జహాన్‌ ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. 15వ ఆర్థిక సంఘా నికి సంబంధించిన ప్రభుత్వానికి పంపించే రూ.11 కోట్ల విలువైన పనుల ప్రతిపాదనల ఫైలుపై తొలి సంతకం చేశారు. నగరాభి వృద్ధే తమ లక్ష్యమని, ఏలూరులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 


రెండో వైస్‌ చైర్మన్ల ప్రమాణ స్వీకారం


జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ రెండో వైస్‌ చైర్మన్‌గా ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌ ముప్పిడి వీరాంజనేయులు(అంజి)ని 13వ వార్డు కౌన్సిలర్‌ పీపీఎన్‌ చంద్రరావు ప్రతిపాదించగా 27వ వార్డు ఎన్‌.సుబ్బలక్ష్మి బలపర్చారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో జరిగిన సమావేశంలో ఎన్నికల అధికారి ప్రసన్నలక్ష్మి ఆయనతో ప్రమాణ స్వీకారం చేశారు. 

నరసాపురం మున్సిపల్‌ రెండో వైస్‌ చైర్మన్‌గా కామన నాగినిని విప్‌ బొంతు రాజశేఖర్‌ ప్రతిపాదించగా, వన్నెంరెడ్డి శ్రీనివాస్‌ బలపర్చడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. నరసాపురం మున్సిపాలిటీలో జరిగిన సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.  

కొవ్వూరు మున్సిపల్‌ రెండో వైస్‌ చైర్మన్‌గా ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌ గండ్రోతు అంజనీదేవిని కౌన్సిలర్‌ ఎస్‌.చాందిని ప్రతిపాదించగా, చీర అరుణ బలపర్చడంతో ఏకగ్రీవంగా ఎన్ని కైనట్టు ప్రిసైడింగ్‌ అధికారి ఆర్‌డీవో డి.లక్ష్మారెడ్డి ప్రకటిం చారు. కొవ్వూరు మున్సిపాలిటీలో జరిగిన సమావేశంలో ఆమెతో కమిషనర్‌ సుధాకర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. 

నిడదవోలు మున్సిపల్‌ రెండో వైస్‌ చైర్మన్‌గా 13వ వార్డు కౌన్సిలర్‌ యాలగడ బాలరాజును షేక్‌ వజీర్‌ ప్రతిపాదించగా, జి.వెంకటలక్ష్మి, జాన్‌బాబు బలపరిచారు. నిడదవోలు మున్సి పాలిటీలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఆయనతో ప్రిసైడింగ్‌ అధికారి, జేసీ పద్మావతి ప్రమాణ స్వీకారం చేయించారు. 




Updated Date - 2021-07-31T05:23:28+05:30 IST