Abn logo
Nov 28 2020 @ 10:22AM

ఏలూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. శనివారం ఉదయం జీలుగుమిల్లి ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా కాకినాడకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ బియ్యం విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement