రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-01-27T06:14:52+05:30 IST

ఏలేశ్వరం, జనవరి 26: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏలేశ్వరంలో కిసాన్‌ మహాసభ, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ, అఖిలభారత ప్రగతిశీల మహిళా, గ్రామీణ వ్యవసాయకార్మిక సంఘాల సంయుక్త ఆ

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
ఏలేశ్వరంలో రాస్తారోకో నిర్వహిస్తున్న రైతులు, మహిళలు

ఏలేశ్వరంలో పలు సంఘాల భారీ ఆందోళన

ఏలేశ్వరం, జనవరి 26: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏలేశ్వరంలో కిసాన్‌ మహాసభ, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ, అఖిలభారత ప్రగతిశీల మహిళా, గ్రామీణ వ్యవసాయకార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యాన భారీ ఆందోళన నిర్వహించారు. లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు నేతృత్వంలో పలువురు రైతులు, కౌలురైతులు, మహిళలు చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ర్యాలీ చేపట్టారు. ఎడ్లబండ్లు, ఆటోలు, మోటారుసైకిళ్లపై ప్లకార్డులతో పట్టణ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. బాలాజీచౌక్‌ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. బహిరంగ సభలో గణేశ్వరరావు ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర నాయకులు ఏగుపాటి అర్జునరావు, మానుకొండ లచ్చబాబు, గుర్రం గోవిందు, బెడుగు రాఘవ, నాగులాపల్లి అర్జునుడు, గండేటి నాగమణి, కందుల వరలక్ష్మి, గుమ్మడి పాదాలమ్మ, సోమాల కుశలన్న పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T06:14:52+05:30 IST