ఏలేశ్వరంలో గుర్తు తెలియని మృతదేహం

ABN , First Publish Date - 2021-02-27T05:31:16+05:30 IST

ఏలేశ్వరం, ఫిబ్రవరి 26: ఏలేశ్వరంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణ శివారు క్వారీ కొండ ప్రాంతం వద్ద చెట్టుకు వేలాడుతూ 50 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహం ఉండడాన్ని స్థానికులు

ఏలేశ్వరంలో గుర్తు తెలియని మృతదేహం
చెట్టుకు వేలాడుతున్న మృతదేహం

ఏలేశ్వరం, ఫిబ్రవరి 26: ఏలేశ్వరంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణ శివారు క్వారీ కొండ ప్రాంతం వద్ద చెట్టుకు వేలాడుతూ 50 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహం ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బట్టబుర్ర, తెల్లవెంట్రుకల గడ్డంతో చొక్కా, లుంగీ ఉన్న మృతదేహం పురుగుల పట్టి దుర్వాసన వస్తూ గుర్తుపట్టరాని విధంగా ఉన్న వైనాన్ని ఎస్‌ఐ గుర్తించారు. అత డు 5 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెం ది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి అనుమానస్పద మృతిపై దర్యాప్తు చేపట్టామని, మృతదేహం ఆధారంగా ఆచూకీ తెలిసినవారు 9440904835లో సమాచారంఅందించాలని ఎస్‌ఐ కోరారు.  

Updated Date - 2021-02-27T05:31:16+05:30 IST