పేటూరు నుంచి రాంపల్లె వైపు మళ్లిన ఏనుగులు

ABN , First Publish Date - 2022-08-07T05:12:48+05:30 IST

సోమల మండలంలోని పేటూరు సమీపంలో మూడు రోజులు మకాం వేసిన 13 ఏనుగుల మంద శుక్ర వారం రాత్రి ఆవులపల్లె పంచా యతీలో ప్రవేశించాయి.

పేటూరు నుంచి రాంపల్లె వైపు మళ్లిన ఏనుగులు
రాంపల్లెలో ధ్వంసమైన వరి నారు

సోమల, ఆగస్టు 6:  మండలంలోని పేటూరు సమీపంలో మూడు రోజులు మకాం వేసిన 13 ఏనుగుల మంద  శుక్ర వారం రాత్రి ఆవులపల్లె పంచా యతీలో ప్రవేశించాయి. వంగసానిపల్లె, రాంపల్లె, కలమందలవారిపల్లెకు చెందిన రైతులు రఘు, నాగరాజ, గూడూసాబ్‌ తదితరుల పొలాల్లో సంచరించి  పంటలను ధ్వంసం చేశాయి. రెండు రోజులు ఎర్రగుంతల వారిపల్లె వద్ద పంటలను ధ్వంసం చేశా యి.  దారి మళ్లిన ఏనుగులు  పగలు సైతం పొలాల వద్దకు రావడంతో రైతులు  భ యాందోళన వ్యక్తం చేస్తున్నారు.  వరినార్లు నా ట్లుకు సిద్ధంగా ఉండి ధ్వంసం కావడంతో దిక్కు తోచని స్ధితిలో పడుతున్నారు.  స్థానిక అటవీ శాఖ సిబ్బందికి సమాచారం తెలిపినా పట్టించు కోవడం లేదంటూ జిల్లా అటవీశాఖ అధికారు లకు ఫిర్యాదు చేశారు. మామిడి తోటలు ధ్వంసం కావడం, డ్రిప్‌పైపులు, టమోటా తోట లు కోల్పోయినవారికి  పరిహారం అందజేయాలని ఉద్యానశాఖ అఽధికారులకు వినతి చేశారు. అనంతరం సోమల తహసీల్దార్‌ శ్యాంప్రసాద్‌రెడ్డికి పంటల నష్టంపై ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-08-07T05:12:48+05:30 IST