కొనసాగుతున్న విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2020-02-20T06:22:45+05:30 IST

లైన్‌మెన్‌ను అకారణంగా సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్ర మం బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని నదిఅగ్రహారం రోడ్డులో

కొనసాగుతున్న విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

గద్వాలక్రైం, ఫిబ్రవరి 19: లైన్‌మెన్‌ను అకారణంగా సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్ర మం బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని నదిఅగ్రహారం రోడ్డులో ఉన్న విద్యుత్‌శాఖ డివిజనల్‌ కార్యాలయంలో డీఈ కార్యాలయం ముందు 1104 యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరస న కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు నర్సింహ మాట్లాడుతూ ధరూర్‌ మండలంలో పనిచేసే లైన్‌మెన్‌ పద్మారెడ్డిని కరెంట్‌ మీటర్ల బిల్లులు వసూలు చేయలేదని ఎస్‌ఈ సస్పెండ్‌ చేశారని, ఆ సస్పెన్షన్‌ ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఉన్నతస్థాయి అధికారులు కిందిస్థాయి ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలని కోరారు.  పద్మారెడ్డిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో 1104 యూనియన్‌ ఉద్యోగ సంఘం  నాయకులు శాలన్న, రామకృష్ణ, శ్యాం, శ్రీనివాసులు, శ్రీధర్‌, అశోక్‌, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T06:22:45+05:30 IST