విద్యుత సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2020-10-20T06:47:04+05:30 IST

ఏపీ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని విద్యుత శాఖ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. తొలుత ఇంజనీరింగ్‌ గెస్ట్‌హౌస్‌లో వారంతా సమావేశమయ్యారు.

విద్యుత సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఉద్యోగుల నిరసన
ఎస్‌ఈ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న విద్యుత ఉద్యోగులు

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 19: ఏపీ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని విద్యుత శాఖ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. తొలుత ఇంజనీరింగ్‌ గెస్ట్‌హౌస్‌లో వారంతా సమావేశమయ్యారు. జేఏసీ చైర్మన్‌ వీవీఎస్‌ నాగేశ్వరరావు, ఓసీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డి.శ్రీధర్‌వర్మ, రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం, జగ్గంపేట, రంపచోడవరంల నుంచి వచ్చిన జేఏసీ ప్రతినిధులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్‌ సవరణ బిల్లు-2020ను ముక్తకంఠంతో వ్యతిరేకించారు. విద్యుత్‌ సంస్థలను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వరాదని నినాదాలు చేశారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలైన ఆర్‌టీపీపీ, డీఆర్‌ఎన్‌టీపీపీ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని పునఃప్రారంభించాలని, 10వేల మెగావాట్ల సౌర ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ జెనకో, ఏపీఈపీడీసీఎల్‌ ద్వారానే చేపట్టాలని, ఒప్పంద, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, పెండింగులో ఉన్న అన్ని నియామకాలు వెంటనే చేపట్టాలని, కరోనా వైరస్‌తో మరణించిన ఉద్యోగులకు రూ.50లక్షలు భీమా సౌకర్యం కల్పించాలని, అపరిమిత మెడికల్‌ పాలసీని ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2020-10-20T06:47:04+05:30 IST