మండల సమాఖ్యకు ముగిసిన అధ్యక్షురాలి ఎన్నిక

ABN , First Publish Date - 2022-05-17T06:48:45+05:30 IST

కొమరోలు మండల మహిళా సమాఖ్య ఎన్నికను సోమవారం జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు డీసీఎం సుబ్బారావు, కృష్ణ కుమారిలు నిర్వహించారు.

మండల సమాఖ్యకు ముగిసిన అధ్యక్షురాలి ఎన్నిక
మండల సమాఖ్యకు ముగిసిన అధ్యక్షురాలి ఎన్నిక

ఎంపీపీ చొరవతో నిర్వహణ

తొమ్మిదేళ్ల తర్వాత కొత్త అధ్యక్షురాలు

కొమరోలు, మే16: కొమరోలు మండల మహిళా సమాఖ్య ఎన్నికను సోమవారం జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు డీసీఎం సుబ్బారావు, కృష్ణ కుమారిలు నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన 48 మంది గ్రామ సమాఖ్య సభ్యులు పాల్గొనాల్సి ఉండగా, 36 మంది పాల్గొన్నారు. వీరందరూ రెడ్డిచెర్లకు చెందిన చెన్నంరాజు నాగేశ్వరమ్మను మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఉపాధ్యక్షురాలిగా ఎం.సుబ్బమ్మ, కార్యదర్శిగా పి బాలసిద్ధమ్మ, ఉప కార్యాదర్శిగా పి.వెంకటసుబ్బమ్మ, కోశాధికారిగా కత్తి.జాస్మిన్‌లను ఎన్నుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారుల సమక్షంలో సభ్యులు చేతులు ఎత్తే పద్ధతిలో ఈ ఎన్నిక నిర్వహించారు

వెలుగు సిబ్బందిపై ఎంపీపీ ఆరోపణలు

 తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడంతో కార్యాలయంలోని సిబ్బంది, వీవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఎంపీపీ కామూరి అమూల్య విమర్శించారు.  పొదుపు గ్రూపు సభ్యుల నుంచి కొమరోలు సీసీ రంగనాయకులు డబ్బులు వసులు చేస్తున్నారని అయినా అధికారులు పట్టించుకోలేదని ఇటీవల కొమరోలులో జరిగిన మహిళాలకు చెక్కుల పంపిణీ ఆమె ఆరోపించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సమక్షంలోనే ఎంపీపీ అమూల్య ఈ వ్యాఖ్యలు బహిరంగంగా చేయడం గమనార్హం. అనంతరం ఈ ఎన్నికల ప్రకియ నిర్వహించారు.

ఇక నుంచి ఏటా ఎన్నిక : ఎంపీపీ

మండల మహిళా సమాఖ్య, గ్రామ సమాఖ్య ఎన్నికలు ఇక నుంచి ఏటా  నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీపీ కామూరి అమూల్య పేర్కొన్నారు. వైకేపీ కార్యాలయంలో కొమరోలు సీసీ రంగనాయకులుపై పలు అరోపణలు వస్తున్నాయని, చర్యలు తీసుకుంటామన్నారు. కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తే చర్యలు తీసుకునేందుకు వెనుకాడమన్నారు. అర్హులైన ప్రతి గ్రూపులకు రుణాలు పారదర్శకంగా అందిస్తామన్నారు.

Updated Date - 2022-05-17T06:48:45+05:30 IST