ఉద్యోగాల వనిత..సునీత..!

ABN , First Publish Date - 2020-10-31T10:11:52+05:30 IST

మ్మనపల్లె మండలంలోని బుచ్చిరెడ్డిగారిపల్లెకు చెందిన ఉప్పుచర్ల సునీత ప్రతిభ మరోసారి వెల్లడైంది. ఆ గ్రామానికి చెందిన జనార్దన, వరలక్ష్మిల రెండవ సంతానం ఈమె.

ఉద్యోగాల వనిత..సునీత..!

-బుచ్చిరెడ్డిగారిపల్లె యువతి ప్రతిభ 

-గ్రూపు-2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దారుగా ఎంపిక


నిమ్మనపల్లె, అక్టోబరు 30: నిమ్మనపల్లె మండలంలోని బుచ్చిరెడ్డిగారిపల్లెకు చెందిన ఉప్పుచర్ల సునీత ప్రతిభ మరోసారి వెల్లడైంది. ఆ గ్రామానికి చెందిన జనార్దన, వరలక్ష్మిల రెండవ సంతానం ఈమె. తండ్రి పల్లెపల్లెకు తిరుగుతూ నూనెల వ్యాపారం చేస్తుంటాడు. తల్లి గృహిణి. తల్లిదండ్రుల కష్టాలను చూసి సునీత పాఠశాల స్థాయి నుంచే చదువుపై శ్రద్ధ చూపించింది. పులివెందులలోని జేఎన్‌టీయూ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసి పోటీ పరీక్షలు రాయడం ప్రారంభించింది. తొలుత సచివాలయ పరీక్షల్లో ర్యాంక్‌ సాధించి మదనపల్లె మండ లం రామారావు కాలనీ వీఆర్వోగా ఎనిమిది నెలలు విధుల నిర్వహించింది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి పరీక్షలో రాష్ట్రస్థాయిలో మెదటి ర్యాంక్‌ సాధించి, గంగాధరనెల్లూరులో నాలుగు నెలలు పనిచేసింది. అనంతరం ఏపీపీఎస్సీ పరీక్షల్లో మండల సర్వేయర్‌గా ఎంపికై ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో మూడు నెలలుగా ట్రైనింగ్‌ పొందుతోంది. ఈ క్రమంలో బుధవారం విడుదలైన గ్రూపు-2 ఫలితాల్లో 286.5 మార్కులతో 112వ ర్యాంక్‌ సాధించింది. దీంతో రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికెనౖట్లు సునీత తెలిపారు. జోన్‌ పరిధిలో 15మంది ఎంపిక కాగా ఇందులో ఈమె ఒకరు. ఐఏఎస్‌ కావడమే లక్ష్యంగా శ్రమిస్తున్నానని తెలిపింది.

Updated Date - 2020-10-31T10:11:52+05:30 IST