Viral Video: బైక్‌పై వృద్ధ దంపతులు.. భర్తను వెనుక కూర్చోపెట్టి బండి నడుపుతున్న బామ్మ స్టైల్‌కు నెటిజన్లు ఫిదా!

ABN , First Publish Date - 2022-09-18T02:31:29+05:30 IST

గతంలో బైక్‌లు, కార్లు వంటి వాహనాలను మగవారు మాత్రమే నడిపేవారు.

Viral Video: బైక్‌పై వృద్ధ దంపతులు.. భర్తను వెనుక కూర్చోపెట్టి బండి నడుపుతున్న బామ్మ స్టైల్‌కు నెటిజన్లు ఫిదా!

గతంలో బైక్‌లు, కార్లు వంటి వాహనాలను మగవారు మాత్రమే నడిపేవారు. డ్రైవింగ్‌కు మహిళలు దూరంగా ఉండేవారు. అయితే కాలం మారింది. ప్రస్తుతం మహిళలు బైక్‌లే కాదు.. పెద్ద పెద్ద వాహనాలు, రైళ్లు కూడా నడుపుతున్నారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video) ఓ బామ్మ తన భర్తను వెనుక కూర్చోపెట్టుకుని బైక్ నడుపుతోంది. ఆ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 


ఆ వీడియోలో బైక్ నడుపుతున్న మహిళకు 60 ఏళ్లకు పైనే వయసు ఉంటుంది. చీర కట్టుకున్న ఆమె తన భర్తను వెనుక కూర్చోబెట్టుకుని ఉల్లాసంగా, వేగంగా బైక్ నడుపుకుంటూ వెళ్తోంది. రోడ్డుపై ఆమె వెనకాల వెళ్తున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బండి నెంబర్ ప్లేట్ బట్టి ఆ దంపతులు తమిళనాడుకు చెందిన వారిగా భావిస్తున్నారు. 

Updated Date - 2022-09-18T02:31:29+05:30 IST