Abn logo
Aug 30 2021 @ 08:31AM

Maharashtra: చిల్డ్రన్స్ హోంలో 18 మంది పిల్లలకు కరోనా

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని ముంబై సబర్బన్ పరిధిలోని మంఖుర్ద్ చిల్డ్రన్స్ హోంలో 18 మంది బాల నేరస్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది.ఈ చిల్డ్రన్స్ హోంలో మొదట 15 మంది పిల్లలకు కరోనా సోకడంతో వారిని చెంబూరులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అనంతరం మూడు రోజుల్లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పిల్లలకు కరోనా అని తేలడంతో వారికి చికిత్స అందిస్తున్నారు.బుధవారం ఓ ప్రైవేటు అనాథ ఆశ్రమంలో 22 మంది పిల్లలకు కరోనా సోకింది. అనంతరం బోర్డింగ్ స్కూలులో 12 ఏళ్ల లోపు పిల్లలకు కూడా కరోనా వచ్చింది. థానే జిల్లా ఉల్లాస్ నగర్ రిమాండు హోంలో 14 మంది పిల్లలకు కూడా కరోనా అని పరీక్షల్లో వెల్లడైంది. పిల్లలకు కరోనా సోకుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 


జాతీయంమరిన్ని...