ఆదివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-08-12T05:20:52+05:30 IST

దివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో గురువారం ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తహసీల్‌ కార్యాలయానికి వచ్చారు.

ఆదివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి


తలమడుగు,ఆగస్టు11: ఆదివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో గురువారం ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తహసీల్‌ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా తలమడుగు జడ్పీటీసీ గోకగణేష్‌రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మి మండలంలోని గిరిజన గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని విన్నవించారు. వెంటనే స్పం దించిన పీవో పీటీజీ నిధుల ద్వారా గిరిజన గ్రామంలో నెలకొన్న సమస్యలను, కోలాం గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు సవరణలో తప్పొప్పులు ఉన్న సరిదిద్దుకునే అవకాశం ఉందన్నారు. మండలంలో వందశాతం ఓటరు న మోదు చేయాలని తహసీ ల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌కు సూచించారు. మండలంలోని ఝరి పూన గూడ ఆశ్రమ పాఠశలను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనా న్ని అందించాలన్నారు. ఉపాధ్యాయులు స్థానికంగా ఉండి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనికోరారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సమస్య,విద్యుత్‌ సౌకర్యం, మరుగుదొడ్ల మరమ్మత్తులు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని ఉపాధ్యాయులు పీవోకు విన్నవించగా త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. పొన్నగూడ గ్రామం నుంచి హాస్టల్‌ వరకు సక్రమంగా రోడ్డు లేక పోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచ్‌ రఘు పీవోకు విన్నవిచంగా వర్షాలు తగ్గిన వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపడతానన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీ స్థలాల్లో పూలమొక్కలు, కిచెన్‌గార్డెన్‌, క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని ప్రధానోపాధ్యాయుడు ప్రేమ్‌దాస్‌కు సూచించారు. ఆయన వెంట వార్డెన్‌ ప్రేమ్‌సింగ్‌, ఐటీడీఏ జేఈ సంతోష్‌, డీఈలు ఉన్నారు.

ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలి

భీంపూర్‌ : ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసంధానం  చేసుకోవాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంంద్రాన్ని సందర్శించారు. రోగ నిరోధక టీకాల మందుల నిల్వ, డెలివరీ, గరిజన గ్రామాల్లో అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జడ్పీటీసీ కుంరాసుధాకర్‌,  ఎంపీపీ కుడ్మెత సంతోష్‌, తహసీల్దార్‌ మహేంద్రనాథ్‌, మెడికల్‌ ఆఫీసర్‌ విజయసారథి తదితరులున్నారు

Updated Date - 2022-08-12T05:20:52+05:30 IST