ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-09-29T04:29:03+05:30 IST

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చింతగూడెంలోని లక్ష్మీదేవి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పీఆర్‌టీయూటీఎస్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి

- ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి

జన్నారం, సెప్టెంబరు 28: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చింతగూడెంలోని లక్ష్మీదేవి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పీఆర్‌టీయూటీఎస్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.  త్వరలోనే ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్‌లతో పాటు బ్లాక్‌ చేసిన 13 జిల్లాల బదిలీలు చేసేందుకు మార్గం సుగమమయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు దశల వారీగా సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు.  జిల్లా అద్యక్షుడు తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డి మాట్లాడుతూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓబీసీ విధానం అమలు పరిచే విధంగా పీఆర్‌టీయూ తరుపున ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న పాఠశాలల గ్రాంట్లను విడుదల చేపిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు ఎమ్మెల్సీకి సమస్యలు విన్నవించారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర నాయకులు చెన్న కేశవరెడ్డి, కొండు జనార్ధన్‌, జాడి మురళి, జిల్లా నాయకులు రాజమౌళి, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T04:29:03+05:30 IST