Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి : మంత్రి

మేడ్చల్‌ అర్బన్‌ : ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తనవంతు పూర్తి సహకారం అందిస్తానని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం  మంత్రిని టీఎన్జీవో నాయకులు కలిశారు. నూతనజోనల్‌ ప్రకారం ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు రూపొందించిన నేపథ్యంలో టీఎన్జీవోస్‌ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అఽధ్యక్షుడు రవిప్రకాష్‌, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌గౌడ్‌తో పాటు ముఖ్య నాయకులు మంత్రితో పలు సమస్యలపై చర్చించారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని, భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా చూడాలని, పీహెచ్‌సీ, మెడికల్‌గ్రౌండ్స్‌ తదితర ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా కేటాయింపులు చేపట్టాలని మంత్రిని కోరారు. నూతన జోనల్‌ విధానంలో 95 శాతం స్థానికులకే అవకాశాలు దక్కనున్నాయన్నారు. ఆప్షన్లు తీసుకుని ఉద్యోగుల కేటాయింపు జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి వారితో చెప్పినట్లు వారు పేర్కొన్నారు. మంత్రిని కలసిన వారిలో ముఖ్య నాయకులు ఈశ్వర్‌, రవిచంద్ర, భరత్‌, కొండల్‌, జేమ్స్‌, గిరికాంత్‌, గోపాల్‌, రామచంద్రం, శశికాంత్‌ రెడ్డి, సత్యం, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement