పైప్‌లైన్ పనులను ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్‌పర్సన్ మంజులారమేష్
వికారాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని ప్రతీ వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మంజులారమేష్ అన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా గురువారం 24వ వార్డు భాష్యం స్కూల్ సమీపంలో, 34వ వార్డు వెంకటేశ్వర కాలనీలో నూతన వాటర్ పైపులైన్ పనులకు ఆమె కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. స్థానిక కౌన్సిలర్లు శ్రీదేవి, అనంతలక్ష్మి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ రమేష్, నాయకులు రాజేందర్‌గౌడ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.