Abn logo
Sep 16 2021 @ 23:14PM

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి

చెక్‌లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

-సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 16: ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్టు సిర్పూరు ఎమ్మెల్యే కోనేరుకోనప్ప అన్నారు. గురు వారం క్యాంపుకార్యాలయంలో ఎస్సీకార్పొరేషన్‌ ద్వారా మంజూరైన చెక్‌లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలపై వివరించారు.

సిర్పూర్‌(టి): మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను గురువారం లబ్ధి దారులకు టీఆర్‌ఎస్‌ నాయకులు పంపిణీ చేశారు. మండల కోఆప్షన్‌సభ్యుడు కీజర్‌హుస్సేన్‌, ఉప సర్పంచ్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.