జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-11T05:58:28+05:30 IST

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. బుధవా రం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభు త్వం అమలుచేస్తున్న పథకాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయ డం జరుగుతుందన్నారు.

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి : కలెక్టర్‌
నూతన కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డికి స్వాగతం పలికిన అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ

బాధ్యతలు స్వీకరించిన జేసీ భాస్కర్‌రావు, ఆర్డీవో జగన్నథరావు

నల్లగొండ, ఆగస్టు 10: జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. బుధవా రం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభు త్వం అమలుచేస్తున్న పథకాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయ డం జరుగుతుందన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌కు ఇప్పటివరకు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఆర్డీవో జగన్నాథరావులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. సూర్యాపేట కలెక్టర్‌గా పనిచేసిన వినయ్‌కృష్ణారెడ్డిని నల్లగొండ కలెక్టర్‌గా బదిలీచేస్తూ ఈ నెల 8వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా అదనపు కలెక్టర్‌గా చంద్రశేఖర్‌స్థానంలో జనగాం అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి స్థానంలో ఏఎమ్మార్పీ జాయింట్‌ కలెక్టర్‌ జగన్నాథరావు బాధ్యతలు స్వీకరించారు. 

Updated Date - 2022-08-11T05:58:28+05:30 IST