సంక్షోభంలో విద్యారంగం

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఖాళీలను భర్తీ చేయక పోవడంతో విద్యారంగం సంక్షోభంలోకి వెళ్లిందని ఎస్టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి సదానందంగౌడ్‌ అన్నారు.

సంక్షోభంలో విద్యారంగం
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందగౌడ్‌

 - వెంటనే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి 

- ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్‌ 

కరీంనగర్‌ టౌన్‌, జూలై 3: రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఖాళీలను భర్తీ చేయక పోవడంతో విద్యారంగం సంక్షోభంలోకి వెళ్లిందని ఎస్టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి సదానందంగౌడ్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన ఎస్టీయూ ద్వితీయ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ అతిథిగా హాజరై ప్రసంగించారు. రెగ్యులర్‌ ఎంఈవోలు, డిప్యూటీ ఎంఈవోలు లేక పాఠశాలల పర్యవేక్షణ ఆగమ్యగోచరంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 317 జీవో అమల్లోని లోపాలతో అనేక మంది ఉపాధ్యాయులకు నష్టం జరిగిందన్నారు. నిలిచిపోయిన 13 జిల్లాల స్పౌజ్‌ కేసులను తిరిగి అనుమతించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలపై ఈనెల 5న పాఠశాల డైరెక్టరేట్‌ను ముట్టడించనున్నామని, కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్ట రవీంద్రచారి, శనిగెరపు రవి, రాష్ట్ర బాధ్యులు వై కరుణాకర్‌రెడ్డి, కందుకూరి దయానంద్‌, గాలేటి తిరుపతిరెడ్డి, సాన కిషన్‌, జిల్లా ఆర్థిక కార్యదర్శి యెనగంటి బాలాజి, జిల్లా నాయకులు కె వివేకానందచారి, దాసరి శ్రీధర్‌, కొట్టె లక్ష్మణ్‌రావు, పిన్నింటి తిరుపతిరావు, గుండా శ్రీనివాస్‌, సమ్మయ్య, గండ్ర దేవేందర్‌రావు, శ్యాంకుమార్‌, వెంకటరమణ, సుభాష్‌, మధుకుమార్‌, ఈసాక్‌, ఐలేని కిషన్‌రావు, కందుకూరి శ్రీనివాస్‌, నరేశ్‌రాజు, రాజేంద్రరెడ్డి, నాగం రమేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T05:30:00+05:30 IST