ఈద్గాలో రంజాన్‌ ప్రార్థనలు వద్దు: సీఐ

ABN , First Publish Date - 2021-05-13T05:50:51+05:30 IST

రంజాన్‌ ప్రార్థనలు ఈద్గాల్లో, బహిరంగ ప్రదేశాల్లో చేయవద్దని సీఐ చంద్రబాబునాయుడు, తహసీల్దార్‌ వెంకటశివ ముస్లిం పెద్దలకు సూచించారు.

ఈద్గాలో రంజాన్‌ ప్రార్థనలు వద్దు: సీఐ

రుద్రవరం, మే 12: రంజాన్‌ ప్రార్థనలు ఈద్గాల్లో, బహిరంగ ప్రదేశాల్లో చేయవద్దని సీఐ చంద్రబాబునాయుడు, తహసీల్దార్‌ వెంకటశివ ముస్లిం పెద్దలకు సూచించారు. బుధవారం స్టేషన్‌ ఆవరణలో ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 51 విడుదల చేసిందని గుర్తు చేశారు. మసీదుల్లో పరిమిత సంఖ్యలో నమాజు చేయాలని అన్నారు. మసీదులను తప్పనిసరిగా శానిటైజ్‌ చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, ముస్లిం మత పెద్దలు  పాల్గొన్నారు. 


ఆళ్లగడ్డ: పట్టణాల్లోని,  గ్రామాల్లోని ముస్లింలు  ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం,  ప్రభుత్వ ఖాజీ మహమ్మద్‌ సాధిక్‌ ముస్లింలకు సూచించారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌ వద్ద వారు ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో వారు  మాట్లాడుతూ నిబంధనల మేరకు రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. 


చాగలమర్రి: కొవిడ్‌ నిబంధనలతో రంజాన్‌ పండుగను ముస్లింలు జరుపుకోవాలని తహసీల్దార్‌ చంద్రశేఖర్‌నాయక్‌ తెలిపారు. బుధవారం పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ మారుతీ ఆధ్వర్యంలో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 51 జీవో ప్రకారం మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవాలన్నారు. ఎంపీడీవో షేక్‌.షంషాద్‌బాను, ప్రభుత్వ ఖాజీ యూనస్‌, రాష్ట్ర మైనార్టీసెల్‌ ప్రధాన కార్యదర్శి బాబులాల్‌ పాల్గొన్నారు. 


ఓర్వకల్లు: రంజాన్‌ పండుగను ముస్లింలు కొవిడ్‌-19 నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఎస్‌ఐ వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం పోలీ్‌సస్టేషన్‌లో ముస్లింలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మసీదుల్లో 50 ప్రార్థనలకు మందికి మించి అనుమతించరాదన్నారు.  ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు నమాజు రెండు విడతల్లో ముగించాలన్నారు.  


ఆత్మకూరు: కరోనా నిబంధనలు పాటిస్తూ రంజాన్‌ పర్వదినాన్ని జరుపుకోవాలని వెలుగోడు ఎస్సై చిన్న పీరయ్య పేర్కొన్నారు. బుధవారం పోలీస్‌ స్టేషన్‌లో వివిధ మసీదుల పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభణ నేపథ్యంలో ముస్లిం మైనారిటీలు రంజాన్‌ పర్వ దినాన్ని నిబంధనల మేరకు నిర్వహించుకోవాలని ఆదేశించారు. ఈద్గాలు, మసీదులలో సామూహిక నమాజ్‌లు పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.  

Updated Date - 2021-05-13T05:50:51+05:30 IST