గ్రామాల్లో ఈటలను అడ్డుకోవాలి

ABN , First Publish Date - 2021-10-20T06:40:07+05:30 IST

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ‘దళతబంధు’ అమలు కాకుండా చేసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గ్రామాలకు రానివ్వకుండా ప్రజలు అడ్డుకోవాలని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చా

గ్రామాల్లో ఈటలను అడ్డుకోవాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మోత్కుపల్లి నర్సింహులు

మాజీమంత్రి, టీఆర్‌ఎస్‌ నాయకుడు మోత్కుపల్లి 

యాదాద్రి రూరల్‌, అక్టోబరు 19: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ‘దళతబంధు’ అమలు కాకుండా చేసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గ్రామాలకు రానివ్వకుండా ప్రజలు అడ్డుకోవాలని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. యాదాద్రి  భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట్టలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజుల్లో ఉప ఎన్నిక ఉండగా ఈటల రాజేందర్‌ ‘దళితబంధు’ అమలుకాకుండా చేశారన్నారు. దళితుల నోట్లో మట్టికొట్టిన ఈటలకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. దళితబంధు పథకాన్ని దేశమంతా అమలుచేయాలని మోత్కుపల్లి డిమాండ్‌ చేశారు. దళితబంధుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు రాబోయే కాలంలో మనుగడ, పుట్టగతులు ఉండవన్నారు. సీఎం కేసీఆర్‌ ఒక్కరే దళితులకు అండగా ఉంటారన్నారు. దళితబంధు పథకాన్ని సంవత్సరం క్రితం మొదలు పెట్టారని, దానిని అమలు చేస్తున్న తరుణంలో ఎం దుకు నిలిపివేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని కులాలకూ దళితబంధు పథకం తరహాలో అంచెల వారీగా అమలు చేసి కేసీఆర్‌ సా మాజిక న్యాయం చేస్తారన్నారు. కులవ్యవస్థ పోవాలన్నా, అంటరానితనాన్ని నిర్మూలన చేయాలన్నా పేదల కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఈటల వంటి మోసగాడికి బుద్ధి చెప్పాలన్నారు. తన 45సంవత్సరాల రాజకీయ జీవితంలో 30సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించానన్నారు. సీఎం కేసీఆర్‌ను బలహీన పర్చే కుట్రలు చేస్తున్నారని, ప్రజలు, రైతులు, పింఛన్‌దారులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారు లు, సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహకారం పొందినవారంతా సీఎం వెంటే ఉంటారన్నారు. విలేకరుల సమావేశంలో యాదగిరిగుట్ట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధాహేందర్‌గౌడ్‌, ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, వైస్‌చైర్మన్‌ గ్యాదపాక నాగరాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T06:40:07+05:30 IST