అమెజాన్‌లో అమ్మకాలు ప్రారంభిస్తున్న ఫ్యాషన్ బ్రాండ్ ‘ఈజీబయ్’!

ABN , First Publish Date - 2020-09-01T01:33:03+05:30 IST

భారత్‌లో అతిపెద్ద ఫ్యాషన్ బ్రాండ్లలో ఒకటైన ఈజీబయ్.. అమెజాన్‌లో తమ ఉత్పత్తులను అమ్మనుంది.

అమెజాన్‌లో అమ్మకాలు ప్రారంభిస్తున్న ఫ్యాషన్ బ్రాండ్ ‘ఈజీబయ్’!

న్యూఢిల్లీ: భారత్‌లో అతిపెద్ద ఫ్యాషన్ బ్రాండ్లలో ఒకటైన ఈజీబయ్.. అమెజాన్‌లో తమ ఉత్పత్తులను అమ్మనుంది. ఈ సందర్భంగా అమెజాన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. అమెజాన్ ఫ్యాషన్‌లో భాగంగా ప్రజలకు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని ముఖ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచడానికి కృషి చేస్తామని తెలిపారు. అమెజాన్ ఫ్యాషన్‌లో ఈజీబయ్ లాంచ్ ద్వారా.. ఈ ఫ్యాషన్ బ్రాండ్ ప్రజలకు మరింత చేరువ అవుతుందని వారు భావిస్తున్నారు.


ప్రస్తుతం తమ కంపెనీకి దేశవ్యాప్తంగా 90 స్టోర్లున్నాయని, ఈ పండుగ సీజన్‌కు వీటిని 100మార్కు దాటించడానికి ప్రయత్నిస్తున్నామని ఈజీబయ్ ప్రతినిధులు తెలిపారు. అలాగే 2022 నాటికి దేశవ్యాప్తంగా 200పైగా స్టోర్లు నెలకొల్పడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈజీబయ్‌తో తమ భాగస్వామ్యం మంచి ఫలితాలిస్తుందని, ఈ బంధాన్ని లాంగ్ టర్మ్ మెయిన్‌టెయిన్ చేయాలనుకుంటున్నామని అమెజాన్ ప్రతినిధులు తెలియజేశారు.

Updated Date - 2020-09-01T01:33:03+05:30 IST