ఈజీగా..

ABN , First Publish Date - 2022-04-23T04:59:30+05:30 IST

పరీక్షా కేంద్రం చిరునామా తెలియక ఇబ్బందులు పడే విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ విద్యా మండలి యాప్‌ను రూపొందించింది.

ఈజీగా..


  • ఇంటర్‌ పరీక్షా కేంద్రాల గుర్తింపు
  • టీఎ్‌సబీఐఈ యాప్‌ రూపకలప్పన
  • జీపీఎ్‌సకు యాప్‌ అనుసంధానం
  • పరీక్షా సెంటర్లు తెలుసుకునేందుకు ఇక సులువు
  • విద్యార్థులకు తప్పనున్న ఇబ్బందులు

పరీక్షా కేంద్రం చిరునామా తెలియక ఇబ్బందులు పడే విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ విద్యా మండలి యాప్‌ను రూపొందించింది. పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో సులువుగా తెలుసుకునేందుకు టీఎ్‌సబీఐఈ యాప్‌ను జీపీఎ్‌సతో అను సంధానం చేశారు. ఈ యాప్‌తో విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని సులభంగా గుర్తించే అవకాశం ఏర ్పడింది. 

వికారాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని సులభంగా గుర్తించేందుకు టీఎ్‌సబీఐఈ యాప్‌లో జీపీఎ్‌సకు అనుసంధానం చేశారు. విద్యార్థి తనకు కేటాయించిన పరీక్షా కేంద్రం కోడ్‌ నమోదు చేస్తే ఎక్కడ కేంద్రం ఉందనేది చూపించడమే కాకుండా ఏవిధంగా అక్కడికి చేరుకోవాలనే మార్గం కూడా చూపుతుంది. పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

ఇంటర్‌ పరీక్షలకు ..

జిల్లాలో మొత్తం 70 ఇంటర్‌ కళాశాలలు ఉండగా, వాటిలో ప్రభుత్వ కళాశాలలు 47 ఉండగా, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ కళాశాలలు 23 ఉన్నాయి. జిల్లాలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 19,662 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారిలో 17,550 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 9,240 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 8,209 మంది విద్యార్థులు వార్షిక పరీక్షల ఫీజు చెల్లించారు. జనరల్‌ విభాగంలో 8,170 మంది విద్యార్థులకు 7,284 మంది ఫీజు చెల్లించగా, ఒకేషనల్‌ కోర్సుల్లో 1,070 మంది విద్యార్థుల్లో 925 మంది ఫీజు చెల్లించారు. ప్రథమ సంవత్సరం 10,422 మంది విద్యార్థులు చదువుతుండగా, వారిలో 9,341 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. జనరల్‌ విభాగం విద్యార్థులు 8,945 మంది ఉండగా, వారిలో 7,991 మంది వార్షిక పరీక్ష ఫీజు చెల్లించగా, ఒకేషనల్‌ కోర్సుల్లో 1477 మంది విద్యార్థులు ఉండగా,వారిలో 1,350 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. 

చురుగ్గా ఏర్పాట్లు

ఇంటర్‌ పరీక్షలు సమీపించడంతో అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రయోగ పరీక్షలు పూర్తి కాగా, వార్షిక పరీక్షల నిర్వహణకు కసరత్తు కొనసాగుతోంది. మే 6వ తేదీన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్ష ప్రారంభం కానుండగా, 7వ తేదీన ద్వితీయ సంవత్సరం పరీక్ష జరపనున్నారు. మే 19వ తేదీతో ఇంటర్‌ పరీక్షలు ముగియనున్నాయి. ఇంటర్‌ పరీక్షల కోసం జిల్లాలో 32 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో గదిలో 20 నుంచి 50 మంది వరకు విద్యార్థులను కేటాయించనున్నారు. కరెంట్‌, తాగునీటి సదుపాయం, టాయిలెట్స్‌ తదితర సౌకర్యాలు ఉన్న కళాశాలలనే అఽధికారులు పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. 

Updated Date - 2022-04-23T04:59:30+05:30 IST