రాజమండ్రి: తుపాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమలో అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. ఖరీఫ్ వరి కోతలు ప్రారంభం కావటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గతవారంలో నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగిన విషయం తెలిసిందే.