రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. ఎగవ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటిమట్టం 10.90 అడుగులకు పెరిగింది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు అధికారులు 13,600 క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేశారు. దాదాపు 23,141 క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలోకి విడుదల చేశారు.