కాకినాడ: తూర్పుగోదారి జిల్లా జగన్నాధపురం పద్మనాభ నగర్లో కనకదుర్గ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆలయం ఆవరణలోని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దుండగులు మురుగు కాలువలో పడేశారు. చుట్టూ ఉన్న పలు మట్టి విగ్రహాలను రాళ్ళతో కొట్టి విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. స్థానికుల ఆందోళనతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి