ఢిల్లీలో భూప్రకంపనలు

ABN , First Publish Date - 2020-07-04T01:42:50+05:30 IST

దేశ రాజధానిలో శుక్రవారం రాత్రి కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ ఏడాది ఢిల్లీని భూప్రకంపనలు తాకడం ఇదే..

ఢిల్లీలో భూప్రకంపనలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ ఏడాది ఢిల్లీని భూప్రకంపనలు తాకడం ఇదే మొదటిసారి. తాజా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని, హర్యానాలోని గురుగావ్‌కు 63 కిలోమీటర్ల దూరంలో భూకంప నమోదు కేంద్రం గుర్తించామని అధికారులు తెలిపారు. ఢిల్లీతో పాటు రాజధానికి అనుకుని ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో, నొయిడా, ఘజియాబాద్‌లోనూ రాత్రి 7 గంటల 48 సెకన్లకు భూమి కంపించింది. 3 నుంచి 4 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. గత మే 29న చివరిసారిగా హర్యానాలోని రోహ్‌తక్‌లో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించి ఢిల్లీకి ఆ ప్రకంపనలు తాకాయి.

Updated Date - 2020-07-04T01:42:50+05:30 IST