Japan: భూకంపం...సునామీ ముప్పు లేదు

ABN , First Publish Date - 2021-09-14T14:17:11+05:30 IST

జపాన్ దేశంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది....

Japan: భూకంపం...సునామీ ముప్పు లేదు

టోక్యో (జపాన్): జపాన్ దేశంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. జపాన్ దేశంలోని ఇబరాకిలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7.46 గంటలకు భూకంపం సంభవించింది.భూకంప కేంద్రం 32.2 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 138.2 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య 450 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. భూమి కంపించడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని, సునామీ ముప్పు కూడా లేదని జపాన్ అధికారులు చెప్పారు. 

Updated Date - 2021-09-14T14:17:11+05:30 IST