Indonesiaలో భారీ భూకంపం...

ABN , First Publish Date - 2022-03-14T12:30:41+05:30 IST

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం యొక్క పశ్చిమ తీరంలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది...

Indonesiaలో భారీ భూకంపం...

మొదట సునామీ హెచ్చరిక జారీ చేసి, ఆపై ఎత్తేసిన కేంద్రం 

జకార్తా: ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం యొక్క పశ్చిమ తీరంలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో స్థానిక నివాసితులు వారి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. సోమవారం తెల్లవారుజామున 4.06 గంటలకు సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది.తీరప్రాంత నగరమైన పరిమాన్ కు పశ్చిమాన 167 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని రాజధాని, అతిపెద్ద నగరమైన పడాంగ్‌కు 197 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది.భూకంపం ప్రభావంతో ప్రజలు భయాందోళనకు గురై తమ ఇళ్లను వదిలి పరుగులు తీశారని జాతీయ విపత్తు నివారణ సంస్థ తన ప్రాథమిక నివేదికలో తెలిపింది.


ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ ప్రకారం భూ ప్రకంపనలతో జనం భయపడ్డారు. ఈ భూకంపం హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని ప్రభావితం చేసే సునామీని సృష్టించే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం మొదట్లో హెచ్చరించింది. అయితే సునామీ ప్రమాదం లేదని హెచ్చరికను పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ఎత్తివేసింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం లేదని ఇండోనేషియా అధికారులు చెప్పారు.


Updated Date - 2022-03-14T12:30:41+05:30 IST