Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 17 2021 @ 08:32AM

Fayzabad: కల్లోల అప్ఘనిస్థాన్‌లో భూకంపం

ఫైజాబాద్ (అఫ్ఘనిస్థాన్): తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన అఫ్ఘానిస్థాన్‌ దేశంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. అసలే తాలిబాన్ల దాడులతో అట్టుడుకుతున్న అఫ్ఘానిస్థాన్ దేశంలోని ఫైజాబాద్ కు 83కిలోమీటర్ల దూరంలో మంగళవారం ఉదయం 6.08 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ అధికారులు చెప్పారు. 230 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు చెప్పారు. తాలిబాన్ల వశంతో అసలే అఫ్ఘాన్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతుండగా, మరో వైపు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.


Advertisement
Advertisement