అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ దేశాలను వణికించిన Earthquake...130 మంది మృతి

ABN , First Publish Date - 2022-06-22T12:35:23+05:30 IST

అప్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌ దేశాలను బుధవారం వచ్చిన భూకంపం వణికించింది.ఈ భూకంపం వల్ల అఫ్ఘాన్ లో 130 మంది మరణించారు....

అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ దేశాలను వణికించిన Earthquake...130 మంది మృతి

ఇస్లామాబాద్‌: అప్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌ దేశాలను బుధవారం వచ్చిన భూకంపం వణికించింది.ఈ భూకంపం వల్ల అఫ్ఘాన్ లో 1,000 మందికి మరణించారు. 1,500 మందికి పైగా గాయపడ్డారు. రెండు దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ అప్ఘానిస్థాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యూఎస్‌ జియోలాజికల్ సర్వే తెలిపింది.ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైందని యూఎస్‌ పేర్కొంది.అఫ్ఘానిస్థాన్ దేశంలోని పక్తికా ప్రావిన్స్‌లో భూకంపం వల్ల 130 మంది మరణించారు. ఈ భారీ విపత్తులో మరో 250 మంది గాయపడ్డారు.పక్టికా ప్రావిన్స్‌లో  జరిగిన భూకంప మరణాలు ధృవీకరించలేదని తాలిబన్ పరిపాలన యొక్క విపత్తు నిర్వహణ అథారిటీ అధిపతి మహ్మద్ నాసిమ్ హక్కానీ చెప్పారు.


తూర్పు ప్రావిన్సులైన నంగర్‌హర్,ఖోస్ట్‌లలో కూడా భూకంపం వల్ల మరణాలు నమోదయ్యాయి.తాలిబన్ల అధికారులు భూకంపం వల్ల జరిగిన ప్రాణనష్టంపై ఆరా తీస్తున్నారు. పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ దేశాల్లోని 119 మిలియన్ల మంది ప్రజలు ఈ భూకంపం బారిన పడ్డారని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఇస్లామాబాద్‌తో పాటు పాక్ దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పాకిస్థాన్ అధికారులు పేర్కొన్నారు.లాహోర్, ముల్తాన్, క్వెట్టా, పాకిస్థాన్‌ దేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.కొన్ని సెకన్ల పాటు భూకంపం సంభవించిందని, ప్రజలు వీధుల్లోకి వచ్చినట్లు అధికారులు చెప్పారు.


గత శుక్రవారం ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండి, ముల్తాన్‌తో సహా పలు పాకిస్థాన్ నగరాలను రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం కుదిపేసింది.ఫైసలాబాద్, అబోటాబాద్, స్వాత్, బునేర్, కోహట్,మలాకంద్‌లలో కూడా భూ ప్రకంపనలు నమోదయ్యాయి.భూకంపంతో రెండు దేశాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.


Updated Date - 2022-06-22T12:35:23+05:30 IST