Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుంటూరు జిల్లా: పులిచింతల సమీపంలో భూప్రకంపనలు

గుంటూరు జిల్లా: పులిచింతల ప్రాజెక్టు సమీపంలో భూప్రకంపనలు వచ్చాయి. ప్రాజెక్టు సమీపంలోని జడపల్లితండా, మాదిపాడు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఆదివారం ఉదయం 7:15 గంటల నుంచి 8:20 గంటల మధ్య మూడుసార్లు భూమి కంపించింది. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. రిక్టార్ స్కేల్‌పై 3.0, 2.7, 2.3గా నమోదయినట్టు శాస్త్రవేత్తలు తెలియజేశారు.


 పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు మరమత్తుల కారణంగా జలాశయం నీటి మట్టం తగ్గించడంతో భూమి పొరల్లో ఏర్పడిన సర్దుబాట్లు కారణంగా పెద్ద శబ్దంతో ప్రకంపనలు వచ్చి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. గత వారం రోజులుగా  ప్రాజెక్టు ప్రాంతంలో భూ ప్రకంపనలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement
Advertisement