‘ఆర్జిత సెలవులు మంజూరు చేయాలి’

ABN , First Publish Date - 2022-06-02T06:28:26+05:30 IST

ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు వేసవి సెలవుల్లో పని చేసినందుకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోకారి, జనార్దన్‌ డిమాండ్‌ చేశారు.

‘ఆర్జిత సెలవులు మంజూరు చేయాలి’

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూన్‌ 1: ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు వేసవి సెలవుల్లో పని చేసినందుకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోకారి, జనార్దన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం డీఈవో కార్యాలయంలో డీఈవో రంగారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.  సెలవుల్లో పని చేసినందు కు వర్క్‌డన్‌ స్టేట్‌మెంట్‌ ప్రిన్సిపాళ్ల నుంచి తెప్పించుకుని మొదలు పెట్టాలని, 15 రోజుల లోపుల సంపాదిత సెలవుల నమోదు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లాలో ఉన్న 36 ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లలో సంపాదిత సెలవులు వారి వారి సేవా పుస్తకాల్లో నమోదు చేస్తామని డీఈవో హామీ ఇచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసిన వారిలో ఎస్టీయూ నాయకులు మౌలాలి, ప్రిన్సిపాల్‌ పద్మావతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోవిందు, వెంకటేశ్వర్లు, ఈరన్న, మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-02T06:28:26+05:30 IST