ఇ-ఎస్‌ఆర్‌ నమోదును వాయిదా వేయాలి

ABN , First Publish Date - 2020-08-12T10:33:29+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్‌ రిజిస్టర్‌ ఆన్‌లైన్‌ నమోదును వాయిదా వేయాలని ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్‌.కరుణాకర్‌ ..

ఇ-ఎస్‌ఆర్‌ నమోదును వాయిదా వేయాలి

కోటబొమ్మాళి, ఆగస్టు 11:  ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్‌ రిజిస్టర్‌ ఆన్‌లైన్‌ నమోదును వాయిదా వేయాలని ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్‌.కరుణాకర్‌ కోరారు. మంగళవారం సంఘ ప్రతినిధులతో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున పలు ప్రాంతాల్లో కంటైన్మెంట్లు ఏర్పా టు చేశారని, లాక్‌డౌన్‌ విధించడం వల్ల నెట్‌ సెంటర్లు తెరుచుకోవడం లేదని, దీంతో ఇ-ఎస్‌ఆర్‌ నమోదుకు ఇబ్బందులు ఎదు రవుతున్నాయన్నారు. అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ సర్వీసులో వివిధ ప్రాంతాల్లో పనిచేసి ఉంటారని, దీంతో ధ్రువీకరణ పత్రాలు సంపాదించేందుకు ఇక్కట్లు ఏర్పడుతున్నాయన్నారు.  ఈ తరుణంలో ఇ-ఎస్‌ఆర్‌ నమోదును కరోనా సాధారణ పరిస్థితికి వచ్చేంతవరకు వాయిదా వేయాలన్నారు. కార్యక్రమంలో కోటబొమ్మాళి ఏపీటీఎఫ్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్ల కేశవరావు, హను మంతు శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-12T10:33:29+05:30 IST