దళారీ వ్యవస్థను నిర్మూలించడమే ఈ ఫామ్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-29T05:03:24+05:30 IST

దళారి వ్యవస్థ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఫామ్‌ మార్కెట్‌ అందుబాటులోకి తీసుకు వచ్చి నట్లు సెలక్షన్‌ గ్రేట్‌ సెక్రటరీ జయలక్ష్మి అన్నారు.

దళారీ వ్యవస్థను నిర్మూలించడమే ఈ ఫామ్‌ లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న జయలక్ష్మి

పెనుగొండ, సెప్టెంబరు 28: దళారి వ్యవస్థ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఫామ్‌ మార్కెట్‌ అందుబాటులోకి తీసుకు వచ్చి నట్లు సెలక్షన్‌ గ్రేట్‌ సెక్రటరీ జయలక్ష్మి అన్నారు.  వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో బుధవారం ఈ ఫామ్‌ మార్కెట్‌ విధానంపై వ్యాపారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇతరుల మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా అమ్ముకునే విధానం ఈ ఫామ్‌ పద్దతిలో ఉందన్నారు. ఈ విధానంలో ఎక్కడ రేటు ఉందో ఆన్‌లైన్‌లో చూసి అక్కడే రైతు అమ్ముకునే విధానం ఉందన్నారు. సూపర్‌వైజర్‌ డి.నరసింహరావు, ఏఎంఎస్‌పీ పి. నాగరాజు,  జి.భాస్కరరాజు, కె.సుధాక్‌రాజు, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T05:03:24+05:30 IST