ముందుగానే సంతకాలు చేశా..
ABN , First Publish Date - 2022-01-28T05:52:18+05:30 IST
వారం రోజుల సంతకాలు రిజిస్టర్‌లో ముందుగానే పెట్టి విధులకు గైర్హాజరైన ఘటనపై గురువారం కోయవారిపాలెం పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రవణ్ విచారణ చేపట్టారు.
తప్పును ఒప్పుకున్న ఎంఎల్‌హెచ్‌పీ విజయ
విధులకు డుమ్మాపై ఆంధ్రజ్యోతి కథనంతో అధికారుల విచారణ
ప్రత్తిపాడు, జనవరి 27: వారం రోజుల సంతకాలు రిజిస్టర్‌లో ముందుగానే పెట్టి విధులకు గైర్హాజరైన ఘటనపై గురువారం కోయవారిపాలెం పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రవణ్ విచారణ చేపట్టారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో అధికారులు విచారణ నిర్వహించారు. రిజిస్టర్‌లు పరిశీలించారు. 27వ తేదీ వరకు రిజిస్టర్‌లో సంతకాలు పెట్టడంపై ఎంఎల్‌హెచ్‌పీ విజయను ప్రశ్నించారు. తాను రిజిస్టర్‌లో సంతకాలు చేసిన మాట వాస్తవమే అని తెలియక తప్పు చేశానంటూ ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని విచారణలో రిటన్‌గా అధికారులకు రాసి ఇచ్చారు. విచారణలో ఎన్‌సీడీసీడీ కన్‌సల్‌టెంట్ డాక్టర్ శశిధర్ పాల్గొన్నారు.