Abn logo
Oct 26 2021 @ 08:20AM

‘నన్ను బెదిరిస్తున్నారు’...పోలీసులకు ద్వారకా తిరుమల EO ఫిర్యాదు

ఏలూరు: డబ్బులు ఇవ్వాలని తనను బెదిస్తున్నారంటూ నలుగురిపై ద్వారకాతిరుమల దేవస్థానం ఈవో సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవో పోస్టింగ్ రావడానికి తామే సహకరించామని,  రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీఐపీ లాంజ్‌లో ఉన్న తన సిబ్బందిని అడ్డగించి లోపలికి వచ్చే ప్రయత్నం చేసారన్నారు. డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని వారు  బెదిరించినట్లు ఈవో ఫిర్యాదులో తెలిపారు.  నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...