ఆనందాల దసరా!

ABN , First Publish Date - 2020-10-25T05:14:34+05:30 IST

ఈ రోజు దసరా పండుగ. చిన్నా పెద్దా తేడా లేకుండా, అన్ని రాష్ట్రాల ప్రజలు ఆనందంగా జరుపుకొనే పండుగ ఇది. మనదేశంలోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌, మలేసియా దేశాల్లోనూ దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు...

ఆనందాల దసరా!

ఈ రోజు దసరా పండుగ. చిన్నా పెద్దా తేడా లేకుండా, అన్ని రాష్ట్రాల ప్రజలు ఆనందంగా జరుపుకొనే పండుగ ఇది.  మనదేశంలోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌, మలేసియా దేశాల్లోనూ దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులుందరూ దసరా పండుగ జరుపుకొంటారు.


  1. దసరా రోజున జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. జమ్మిచెట్టుకు ప్రదక్షిణలు చేసి, ఆ జమ్మి చెట్టు ఆకులను పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. పాండవులు వనవాసం సమయంలో తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై భద్రపరచారని పురాణాలు చెబుతున్నాయి. 
  2. విజయదశమి రోజున వాహన పూజ, ఆయుధపూజ చేస్తారు. 
  3. హిందూ పురాణాల ప్రకారం రాముడి, రావణుడికి మధ్య తొమ్మిది రోజుల పాటు భీకరయుద్ధం జరిగింది. పదో రోజున రాముడు రావణుడిని సంహరించాడు. ఆ రోజునే దసరా జరుపుకొంటారు. 
  4. దసరాను విజయదశమి అని కూడా పిలుస్తారు. మహిషాసురుడనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను ప్రజలందరూ ఆనందంగా జరుపుకొంటారు.

Updated Date - 2020-10-25T05:14:34+05:30 IST