ముగిసిన దుర్గా నవరాత్రులు

ABN , First Publish Date - 2021-10-17T05:43:07+05:30 IST

దేవీ నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిది రోజులూ భక్తులతో పూజలందుకున్న అమ్మవారిని శనివారం నిమజ్జనం చేశారు. భారీ ఊరేగింపుగా విగ్రహాలను త రలించారు. పులివేషాలు, ప్రత్యేక భజనలు, డీజేలు, శక్తివేషాలు ముందు నడవగా వెనుక అమ్మవారి విగ్రహాల ఊరేగింపులు కోలాహలంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని అయ్యకోనేరులో ఎక్కువగా నిమజ్జనాలు జరిగాయి.

ముగిసిన దుర్గా నవరాత్రులు
నిమజ్జనానికి ముందు అమ్మవారికి హారతి ఇస్తున్న దృశ్యం

విజయనగరం(ఆంధ్రజ్యోతి)/ కురుపాం, అక్టోబరు16 : 

దేవీ నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిది రోజులూ భక్తులతో పూజలందుకున్న అమ్మవారిని శనివారం నిమజ్జనం చేశారు.  భారీ ఊరేగింపుగా విగ్రహాలను త రలించారు. పులివేషాలు, ప్రత్యేక భజనలు, డీజేలు, శక్తివేషాలు ముందు నడవగా వెనుక అమ్మవారి విగ్రహాల ఊరేగింపులు కోలాహలంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని అయ్యకోనేరులో ఎక్కువగా నిమజ్జనాలు జరిగాయి.

కురుపాం కోటలో దసరా ఉత్సవాలు 

కురుపాం కోటలో దసర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్‌ శుక్రవారం తన నివాసం కోటలో కుటుంబ సమేతంగా ఆయుధ పూజ చేశారు.  న్యూఢిల్లీకి చెందిన పురోహితుల వేదమంత్రోచ్ఛారణ.. మేళ తాళాల మధ్య  పూజలు చేశారు. దీనిలో భాగంగా కోటలో పూరాతన ఖడ్గాలు, బల్లేలు, తుపాకులు ఏర్పాటు చేశారు. 

అశోక్‌గజపతిరాజు నివాసంలో...

దసరా పండుగను పురస్కరించుకుని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌నేత అశోక్‌ గజపతిరాజు తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి దసరా పూజలు నిర్వహించారు.  వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. పసుపు రంగు వేసి ఉన్న సైకిల్‌పై బంగ్లాలో కాసేపు చక్కర్లు కొట్టారు. 

Updated Date - 2021-10-17T05:43:07+05:30 IST