ఇరుకు మార్కెట్‌తో ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-05-19T05:05:24+05:30 IST

ఇరుకైన ఆవరణ.. ఇరుకు గోదాములు.. ఉన్న చోటులోనే ఓ షెడ్డులో ఫైర్‌స్టేషన్‌... ఇదీ దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌ దుస్థితి. దుబ్బాకలో 2001లో వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. 1982లోనే సిద్దిపేట మార్కెట్‌ పరిధి నుంచి విడిపోయేందుకు తీర్మానించారు. దుబ్బాకలో నూతన మార్కెట్‌ నిర్మాణానికి 9.20 ఎకరాల స్థలం సేకరించారు. కానీ రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం నూతన మార్కెట్‌ ఏర్పాటు సాధ్యమైంది. మొదట దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌ కమిటీని

ఇరుకు మార్కెట్‌తో ఇక్కట్లు
దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌లో కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యం

దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌లో సమస్యల తిష్ఠ


దుబ్బాక, మే 18: ఇరుకైన ఆవరణ.. ఇరుకు గోదాములు.. ఉన్న చోటులోనే ఓ షెడ్డులో ఫైర్‌స్టేషన్‌... ఇదీ దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌ దుస్థితి. దుబ్బాకలో 2001లో వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. 1982లోనే సిద్దిపేట మార్కెట్‌ పరిధి నుంచి విడిపోయేందుకు తీర్మానించారు. దుబ్బాకలో నూతన మార్కెట్‌ నిర్మాణానికి 9.20 ఎకరాల స్థలం సేకరించారు.  కానీ రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం నూతన మార్కెట్‌ ఏర్పాటు సాధ్యమైంది. మొదట దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌ కమిటీని 1999లో తొగుటలో ఏర్పాటు చేశారు. దుబ్బాక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో 2001లో దుబ్బాకకు తరలించారు.


నాలుగు ఎకరాల్లో గోదాములు

మార్కెట్‌ కమిటీలో లావాదేవీలు పెరిగినకొద్దీ ప్రాంగణం ఇరుకుగా మారుతున్నది. మార్కెట్‌యార్డులో 9,800 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన ఆరు గోదాములను నిర్మించారు. అయినా మరిన్ని గోదాములు నిర్మించాల్సిన అవసరమున్నది. మండలంలో 42 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతీ సీజన్‌లో దాన్యాన్ని సేకరిస్తున్నారు. వడ్లు నిల్వ చేసేందుకు సరిపడా గోదాంలు లేకపోవడంతో ప్రైవేటు రైస్‌మిల్లుల్లో నిల్వ చేయాల్సి వస్తున్నది. స్టేట్‌ వేర్‌హౌస్‌ కార్పొరేషన్‌ (ఎస్‌డబ్యూసీ)కు సుమారు 5వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వ చేసేందుకు స్థలం కేటాయించాల్సి వస్తున్నది. దీంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని దుబ్బాక, సిద్దిపేటలకు తరలించాల్సి వస్తున్నది. దీంతో రవాణాకు కోట్లాది రూపాయాలు వెచ్చించాల్సి వస్తున్నది. తరచుతగా ధాన్యం కొనుగోలులో జాప్యం ఏర్పడుతున్నది. 


తడుస్తున్న ధాన్యం 

దుబ్బాక మార్కెట్‌ యార్డు పరిధిలో 5వేల ఎకరాల నుంచి ధాన్యం సేకరిస్తారు. ప్రతీ సీజన్‌లో 50వేల క్వింటళ్ల ధాన్యం మార్కెట్‌ యార్డుకు వస్తున్నది. కానీ ధాన్యం ఆరబోసేందుకు సరిపడా షెడ్లు లేవు. ప్రతీ సంవత్సరం ఆకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నది. మార్కెట్‌యార్డు ఆవరణలోనే రైతు వేదికను నిర్మించడంతో మరిన్ని అవస్థలు తప్పడంలేదు. యార్డులో స్థలం సరిపోక ఆరుబయటనే కొనుగోళ్లు చేయాల్సి వస్తున్నది. వర్షకాలంలో డబుల్‌బెడ్రూం కాలనీ సమీపంలోని ఖాళీ స్థలంలో, బీరప్ప ఆలయం, రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తున్నది. 


స్థలం సేకరిస్తేనే పరిష్కారం

సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న దుబ్బాక మార్కెట్‌ యార్డును విస్తరించాల్సిన అవసరమున్నది. మార్కెట్‌కు అనుసందానంగా ఏర్పాటు చేయ తలపెట్టిన సబ్‌యార్డుకు మరో 10 ఎకరాల స్థలం సేకరించి, విస్తరించాల్సిన అవసరం ఉన్నది. రైతులకు, పనివారికి విశ్రాంతి గదులు నిర్మించాల్సి ఉన్నది. మార్కెట్‌ యార్డుల 2 కోట్ల రూపాయాలను సేకరించి, స్థల సేకరణ పూర్తిచేయగలిగితే, దుబ్బాక వ్యవసాయ మార్కేట్‌ యార్డు మరిన్నీ సేవలను అందించగలుగుతుంది. అందుకు పెద్దచీకోడు మెదక్‌ పార్లమెంటు సభ్యులు కొత్తప్రభాకర్‌రెడ్డి, మంత్రి తన్నీరు హరీ్‌షరావు చొరవ చూపాలని పాలక మండలి విన్నవించింది.  

Updated Date - 2022-05-19T05:05:24+05:30 IST