డ్యూయల్‌ యూఎస్‌బీ-సీ చార్జర్‌

ABN , First Publish Date - 2022-06-25T10:25:19+05:30 IST

మాక్‌బుక్‌ ఎయిర్‌, మాక్‌బుక్‌ ప్రొని విడుదల చేసిన సందర్భంలోనే యాపిల్‌ ప్రప్రథమంగా సరికొత్త చార్జర్‌ను కూడా మార్కెట్లోకి పంపింది.

డ్యూయల్‌ యూఎస్‌బీ-సీ చార్జర్‌

మాక్‌బుక్‌ ఎయిర్‌, మాక్‌బుక్‌ ప్రొని విడుదల చేసిన సందర్భంలోనే యాపిల్‌ ప్రప్రథమంగా సరికొత్త చార్జర్‌ను కూడా మార్కెట్లోకి పంపింది. 35 వాట్‌ డ్యూయల్‌ పోర్ట్‌ యూఎస్‌బీ చార్జర్‌ను విడుదల చేసింది. డ్యూయల్‌ పోర్ట్‌ చార్జర్‌ అంటే ఒకేసారి రెండు డివైస్‌లకు చార్జింగ్‌ పెట్టుకునే వీలు ఉంటుంది. అసలు ఇది ఎలా పనిచేస్తుందో తెలియజేస్తూ యాపిల్‌ ఒక సపోర్ట్‌ డాక్యుమెంట్‌ను కూడా రిలీజ్‌ చేసింది. రెండు డివైస్‌లకు ఒకేసారి పెట్టగానే వాటి అవసరానుగుణంగా పవర్‌  డిస్ట్రిబ్యూట్‌ అయ్యేలా ఇందులో ఏర్పాటు ఉంది. ఓనర్‌ అడాప్టర్‌పై రెండు పోర్టులు కనెక్ట్‌ అవుతాయి. చార్జింగ్‌ కూడా సరిసమానంగా ఉంటుంది. అదెలాగంటే


మేక్‌నోట్‌బుక్‌ - ఐఫోన్‌ లేదా ఐపాడ్‌ను కనెక్ట్‌ చేస్తే 17.5 వాట్స్‌ పవర్‌ను ఒక్కోటి పొందుతాయి.

ఐఫోన్‌, ఐపాడ్‌ను కనెక్ట్‌ చేసినా అదే పరిస్థితి ఉంటుంది.

మేక్‌బుక్‌ లేదా ఐఫోన్‌తో యాపిల్‌ వాచ్‌ లేదా ఎయిర్‌ పాడ్స్‌ని కలిపితే మొదటి రెండూ 27.5 వాట్స్‌, చివరి రెండూ 7.5 వాట్స్‌ మేర చార్జింగ్‌ అవుతాయి. 

ఏదో ఒకటి మాత్రమే చార్జింగ్‌ కావాలనుకుంటే రెండో దానిని అన్‌ప్లగ్‌ చేస్తే సరిపోతుంది. యావత్తు వాట్స్‌ కోరుకున్న డివైస్‌కే లభిస్తాయి. దీని ధర రూ.5,800. అడాప్టర్‌ను వేరుగా కొనుగోలు చేసుకోవాలి. అది ఎట్టి పరిస్థితుల్లో ఈ చార్జర్‌తో కలపి ఇవ్వరు.

Updated Date - 2022-06-25T10:25:19+05:30 IST