రూ. 29.42 కోట్లతో పైపులైన్‌ పనులు

ABN , First Publish Date - 2021-07-27T04:34:05+05:30 IST

పట్టణంలో తాగునీటి పైపులైను నిర్మాణానికి రూ. 29.42 కోట్లు మంజూరయ్యాయని మంత్రి తానేటి వనిత తెలిపారు.

రూ. 29.42 కోట్లతో పైపులైన్‌ పనులు
తాగునీటి పైపులైను పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి వనిత

కొవ్వూరు, జూలై 26: పట్టణంలో తాగునీటి పైపులైను నిర్మాణానికి రూ. 29.42 కోట్లు మంజూరయ్యాయని మంత్రి తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు మునిసిపల్‌ కార్యాలయం వద్ద సోమవారం తాగునీటి పైపులైను పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు, తణుకు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, కొవ్వూరు పట్టణాలలో తాగునీటి పైపులైను నిర్మాణానికి ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వ్‌స్ట్‌మెంటు బ్యాంకు రూ. 116 కోట్లు మంజూరు చేసిందన్నారు. పట్టణంలో 17.9 కిలోమీటర్లు పైపులైను నిర్మాణం చేపట్టి 9వేల గృహాలకు తాగునీరు అందిస్తామన్నారు. చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కోడూరి శివరామకృష్ణ, వైస్‌ చైర్మన్‌ మన్నె పద్మ, కమిషనర్‌ కేటీ.సుధాకర్‌, కౌన్సిలర్లు కంఠమణి రమేష్‌బాబు, రుత్తల ఉదయభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:34:05+05:30 IST